//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోరఖ్పూర్ ఆక్సిజన్ అంద‌క 63 మంది చిన్నారులు మృతి

Category : national

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్పూర్ లోని ఆసుపత్రిలో ఆక్సిజన్ అంద‌క 63 మంది చిన్నారులు గత ఐదు రోజులుగా చనిపోయారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే కంపెనీకి బాకీలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌దురు కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసిన‌ట్లు తెలుస్తున్న‌ది.

బాబా రాఘ‌వ దాస్ మెడిక‌ల్ కాలేజీకి పుష్పా కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయితే బాకీలు చెల్లించ‌కుంటే స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామ‌ని గ‌తంలో ఆ కంపెనీ హాస్ప‌ట‌ల్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆగ‌స్టు ఒక‌ట‌వ తేదీన ఆ కంపెనీ ఈ అంశంపై లేఖ కూడా రాసింది. పాత బిల్లులు చెల్లించ‌ని కార‌ణంగానే హాస్ప‌ట‌ల్‌కు ఆక్సిజ‌న్ అంద‌లేదా అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

కాగా, నెల 9న ముఖ్యమంత్రి తనంత తానుగా ఆ ఆస్పత్రికి వెళ్లారని, తాను కూడా వెళ్లానని కానీ ఒక్క డాక్టర్‌గానీ, అధికారి గానీ అక్కడ ఆక్సిజన్ సరఫరా అందడం లేదన్న విషయం తమతో చెప్పలేదని ఆరోగ్యమంత్రి సిద్దార్థనాథ్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను వదిలే ప్రసక్తే లేదనీ, సత్వరమే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బిల్లుల గురించి తెలిసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఢిల్లీకి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  ఆదిత్య‌నాథ్ ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశించారు.ఇలా ఉండగా, ఈ సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత‌లు గులామ్ న‌బీ ఆజాద్‌, రాజ్ బ‌బ్బ‌ర్‌లు హాస్ప‌ట‌ల్ సంద‌ర్శించి రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపించారు.

ఇది సీఎం యోగికి అవమాన‌మ‌ని, పిల్ల‌ల పేరెంట్స్‌కు ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీఎస్పీ నేత సుదీంద్ర బ‌దోరియా అన్నారు. పిల్ల‌ల్ని కోల్పోయిన త‌ల్లితండ్రుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని, పేద కుటుంబాల‌కు ఉచిత మెడిసిన్ కూడా ఇవ్వాల‌ని ఎస్పీ నేత రామ్ గోపాల్ యాద‌వ్ డిమాండ్ చేశారు. ఇది విషాదం కాదు అని, అది ఊచ‌కోత అని నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత కైలాశ్ స‌త్యార్థి విమ‌ర్శించారు.