సైరా మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరు తెల్లవారిపై పోరాటాలను సాగించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు సురేందర్‌రెడ్డి. జార్జియా షెడ్యూల్లో జగపతిబాబు, తమిళనటుడు విజయ్ సేతుపతి కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు వారితోపాటు కన్నడ నటుడు సుదీప్ కూడా తోడయ్యాడు.
జార్జియా షెడ్యూల్ ఒక్కదానికే నిర్మాత రామ్ చరణ్ దాదాపు 60 కోట్లు వెచ్చిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సమ్మర్లోకానీ, లేదా జులైలో కానీ, ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.