//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మార్కెట్లోకి 5G......!

Category : national

వినియోగదారులకు ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ సంస్థ శుభవార్త అందించింది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 5జీ ఎన్‌ఆర్ మోడెమ్‌ను క్వాల్‌కామ్ సంస్థ విడుదల చేసింది. 2019లో 5జీ పరికరాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్వాల్‌కామ్ సంస్థ ప్రకటించింది. 2020 కల్లా 5జీ పరికరాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ అంశంపై భారత టెలికాం అధికారులతో కంపెనీ ప్రతినిధులు చర్చించారు. ఇండియాలో 5జీ సేవలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. 2019లో 5జీ టెక్నాలజీతోపాటు 5జీ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.