విమానయాన సంస్థ ఎయిర్ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా దేశీయ విమానాల్లో విద్యార్థులకు డిస్కౌంట్ల రేట్లలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఎకనామీ తరగతి టికెట్లపై 50శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. 12నుంచి 26 సం.రాల వయస్సున్న విద్యార్థులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.
ఈ ఆఫర్ విద్యార్థులతోపాటు సైనికులు, సీనియర్ సిటిజన్స్‌కు వర్తించనున్నట్లు తెలిపింది. ట్విట్టర్ ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను ఎయిర్ఇండియా వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఆ ఆఫర్ వర్తిస్తుందనీ, ప్రయాణానికి వారం రోజుల ముందు టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఆఫర్ద్వారా టికెట్ బుకింగ్ ముగింపు తేదీని మాత్రం స్పష్టం చేయలేదు.
అలాగే ఈ ఆఫర్ లో 25కేజీల చెక్ ఇన్‌బ్యాగేజీ కూడా ఉచితమని తెలిపింది. ఎయిర్ ఇండియా అధికార వెబ్సైట్, కార్యాలయాల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.