//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీలో రోజు ఎంత మందిపై రేప్ జరుగుతుందో తెలిస్తే

Category : national

రేప్” ఇప్పుడు ఈ పదం వింటేనే దేశం అట్టుడికిపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఢిల్లీ నుంచి గల్లి వరకు... తడ నుంచి ఇచ్చాపురం వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇలా ఎక్కడ చూసినా రేప్ ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. అయితే ఈ రేప్ ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయంటున్నారు పోలీసులు. తాజాగా ఒక నివేదికను విడుదల చేసారు.

గడిచిన మూడు నెలల్లో ప్రతి రోజు ఐదుగురు మహిళలు లైంగిక దాడులకు గురయ్యారని ఢిల్లీ పోలీసు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017లో ఏప్రిల్‌ రెండం వారం చివరి వరకూ 563 లైంగిక దాడి కేసులు నమోదవగా, ఈ ఏడాది అదే సమయానికి 578 ఈ తరహా కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమాయానికి 944 మహిళలపై వేధింపుల కేసులు నమోదవగా, ఈ ఏడాది అదే సమయంలో 883 కేసులు నమోదయ్యాయి.

96.63 శాతం కేసుల్లో వారికి తెలిసిన వారు, బంధువులు, సమీప వ్యక్తులే ఉండడం గమనార్హం. ఈ విషయమై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. కేసులు సత్వరంగా నమోదు చేయడం వల్లనే సంఖ్య పెరిగిందని, వాస్తవానికి గతంతో పోల్చుకుంటే ఇవి తగ్గాయని వారు పేర్కొన్నారు. అయితే మహిళలపై వేధి౦పుల కేసులు మాత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టాయని ఈ గణాంకాలు వెల్లడించడం శుభ పరిణామం.

ఇక గతేడాది మొత్తానికి గణాంకాలు చూసుకున్నట్లయితే.. 2016లో 2064 లైంగిక దాడి కేసులు నమోదవగా, 2017లో 2049 కేసులు నమోదయ్యాయి. 2016లో 4035 లైంగిక వేధింపుల కేసులు నమోదవగా, గత ఏడాది ఈ తరహా కేసులు 3273 నమోదయ్యాయని ఢిల్లీ పోలీసు గణాంకాలు వెల్లడించాయి.ఇటీవల జరిగిన కథువా, ఉన్నావ్ , దాచేపల్లి రేప్ ఘటనలు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.