ఐదువేల సంవత్సరాల క్రితం నాటి పురాతన విష్ణు మందిరం బయటపడింది. ఇండోనేషియా లోని బాలికి దగ్గర్లో సముద్రగర్భంలో దీన్ని కనుగొన్నారు. బాలి కి దగ్గర ఉన్న స్కూబా డైవింగ్ స్పాట్ అయిన పెముటెరన్ బీచ్ లో దీన్ని కనుగొన్నారు.
దీన్నే అండర్ వాటర్ టెంపుల్ బాలి అని పిలుస్తారట. అక్కడ అండర్ వాటర్ లోకి ఎవ్వరు వెళ్లినా... లార్డ్ విష్ణును దర్శించుకోకుండా రారట. తూర్పు ఆసియా ప్రాంతంలో ఇదివరకు హిందూ, భౌద్దులకు చెందిన ఎన్నో పురాతన ఆలయాలు బయటపడ్డాయి.
ఈ 5000 సంవత్సరాల క్రితం నాటి విష్ణు మందిరంలో శ్రీ మహావిష్ణువు సేద తీరుతున్న విగ్రహం దర్శనమిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే హిందూ, బౌద్ధ ప్రభావం ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం, థాయిలాండ్, ,మయన్మార్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలలో కనిపిస్తుంది. వేయి నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన భారీ హిందూ, బౌద్ధ ఆలయాలు అనేకం ఉన్నాయి.