//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

33 శాతం బాల్య వివాహాలు భారత్ లోనే

Category : national

బాల్య వివాహాల నిర్మూలనకు దేశంలో పకడ్బందీ చట్టాలు ఉన్నప్పటికీ వాటిని నివారించలేకపోతున్నామన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయని, అందులో భారత్‌లోనే 33శాతం వరకు జరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. దాదాపు 10.3 కోట్ల మందిభారతీయులకు 18 ఏండ్లు నిండకముందే పెండ్లిండ్లు జరుగుతున్నాయని, అందులో దాదాపు 8.52 కోట్ల మంది బాలికలు ఉన్నారని నివేదిక పేర్కొంది. ఈ నివేదికను నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ  విడుదల చేశారు.

ఫిలిపీన్స్ జనాభా దాదాపు 10కోట్లు. జర్మనీ జనాభా దాదాపు 9కోట్లు. కానీ భారత్‌లో జరుగుతున్న బాల్య వివాహాలు 10కోట్ల 30 లక్షలు. అంటే ఆ దేశాల జనాభా కన్నా భారత్‌లో జరుగుతున్న బాల్య వివాహాల సంఖ్య అధికం. ప్రపంచంలో ప్రతి నిమిషానికి 28 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

బాల్య వివాహాలు పెరిగిపోవడానికి నిరక్షరాస్యత, సంప్రదాయ విధానాలు, బాలికలను బరువుగా భావించడం తదితర కారణాలు ప్రభావం చూపుతున్నాయి. దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 70శాతం పెండ్లిండ్లు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోనే జరుగుతున్నాయి.