Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 18 days ago | Category : business

అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం ఆదేశ కుబేరుడిపై తీవ్రప్రభావం చూపింది. డౌజోన్స్ పతనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది బిలియనీర్లకు చెందిన లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడులు పెట్టిన సంపన్నులు సుమారు 7 లక్షల 32 వేల కోట్ల రూపాయలు నష్టపోయారని బ్లూమ్‌ బర్గ్ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా సుమారు 500 కోట్ల డాలర్లు నష్టపోయిన వ్యక్తి బెర్క్‌ షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్. కేవలం 24 గంటల వ్యవధిలో ఆయన ఈ మొత్తాన్ని కోల్పోవడం విశేషం.

డౌజోన్స్ లో 9.2 శాతం మేర పతనమైన వెల్స్ అండ్ ఫార్గో కంపెనీలో మెజారిటీ వాటా బెర్క్‌ షైర్ కంపెనీదే కావడంతో బఫెట్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తరువాతి స్థానంలో ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌ బర్గ్ 360 కోట్ల డాలర్లు నష్టపోయాడు.

అటు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నీరాజనాలందుకుంటున్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా సుమారు 21 వేల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. ఆల్ఫాబెట్ ఓనర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ లు కూడా సుమారు 15 వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది. భారీ మొత్తంలో నష్టాలు చవిచూడడంతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇండియా లో కూడా స్టాక్ మార్కెట్ల పతనం వైపు సాగుతున్నాయి.


లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 3 days ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 15 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 16 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 16 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 16 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 19 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 23 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 23 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 23 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 24 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 24 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!