ఈ మధ్య వరకు చైనాలో ఒకరికి మించి ఎక్కువ మంది పిల్లలను కనడం నేరంగా పరిగణిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితమే ఈ నిబంధన తొలగించారు. ఇప్పుడు తాజాగా కుక్కలకు కుటుంభం నియంత్రణ పాటిస్తున్నారు. "ఓకే కుక్కే ముద్దు, రెండయితే వద్దు" అనే నినాదంతో వన్ డాగ్ పాలసీ ని చైనాలో తీసుకు వచ్చారు.
అంటే ప్రతి ఇంట్లో ఒక కుక్కనే పెంచుకోవాలట. ఒకటి దాటితే 300 డాలర్లు ఫైన్ కట్టాలట. ఈస్ట్ చైనాలోని క్వింగ్డావో సిటీలో ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టారు. అంతే కాదు. 40 రకాల కు చెందిన కొన్ని బ్రీడ్ల కుక్కలను కూడా తమ ఇండ్లల్లో పెంచుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. వాటిలో జెర్మన్ షెఫర్డ్, టిబెటన్ మస్టిఫ్స్, పిట్ బుల్స్ లాంటి బ్రీడ్స్ లిస్ట్ లో ఉన్నాయి.
చైనాలో ఉన్న పెట్స్ లో 62 శాతం కుక్కలేనట. దీంతో దేశంలో మనుషుల కన్నా కుక్కల జనాభా విపరీతంగా పెరిగిపోతున్నదట. దీంతో కుక్కల వల్ల జరిగే ప్రమాదాలు కూడా చైనాలో పెరిగిపోతున్నాయట. అందుకే కుక్కల వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడానికే ఈ పాలసీ ని ప్రవేశ పెట్టారట.
పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకొని 60 డాలర్లు పే చేస్తే అప్పుడు కుక్కను పెంచుకోవడానికి అనుమతి ఇస్తారట. ఇదివరకు ఉన్న వన్ చైల్డ్ పాలసీని రెండు ఏండ్ల క్రితం చైనా ఎత్తేసింది.