మూడో టెస్టులో భారత్ విజయం సాధించడం లాంఛనమే కానీ అయితే నాలుగో రోజే మ్యాచ్ను దక్కించుకుందామనుకున్న పర్యాటక జట్టుకు ఇంగ్లండ్ నుంచి గట్టి సవాల్ ఎదురైంది. అనూహ్య మలుపులతో ఉత్కఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో నిలిచింది.
ఆరంభంలో పేసర్ల విజృంభణకు ఇంగ్లండ్ తొలి సెషన్లోనే 62 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బట్లర్, స్టోక్స్ అద్భుత ఆటతీరును కనబరుస్తూ సెంచరీ భాగస్వామ్యంతో భారత బౌలర్లను విసిగించారు.. చివరి సెషన్లో బుమ్రా కొత్త బంతితో మాయ చేస్తూ ఐదు వికెట్లతో రాణించినా టెయిలెండర్లు పట్టు వీడకపోవడంతో మ్యాచ్ ఫలితం కోసం భారత్ ఐదో రోజు వరకు ఆగక తప్పడం లేదు.