Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Category : national politics state

గత కొద్దీ రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న ప్రణయ్ హత్య కేసు మరో మలుపు తిరగబోతుంది . ఇప్పటివరకు ప్రణయ్ చనిపోవడం తో అందరూ అమృతకి బాసటగా నిలిచారు కానీ ,ఒకసారి జరిగిన మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే మారుతీరావు చేసింది కూడా న్యాయమే అంటున్నారు తల్లితండ్రుల సంఘం .

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురిని తనకి కాకుండా తీసుకుపోతే ఏ తండ్రి చూస్తూ ఉండలేదు అని చెప్పుకువస్తున్నారు . దీనితో రోజు రోజుకి ప్రణయ్ హత్య కేసు లో a1 గా ఉన్న ముద్దాయి మారుతీరావు కి మద్దతు పెరుగుతూ వస్తుంది . సేవ్ మారుతీరావు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది . అలాగే మిర్యాలగూడ సెంటర్ లో ప్రణయ్ విగ్రహం పెట్టాలని అమృత కోరుకుంటుంది . దీనికి కావాల్సిన పనులని కూడా అమృత శర వేగంగా పూర్తి చేసుకుంటూ వస్తుంది .

మిర్యాలగూడ సెంటర్ లో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్న వేళ, ఆర్యవైశ్యులు ఘాటుగా స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావుకు మద్దతు పలుకుతూ, నల్గొండలోని వాసవీ భవన్ నుంచి జైలు వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రణయ్ విగ్రహ ఏర్పాటు వద్దంటూ కలెక్టరేట్ లో, ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రాలను అందించారు.

తరువాత మారుతీరావును ఉన్న జైలుకు వెళ్లి, మారుతీరావు ని , ఆయన సోదరుడు శ్రవణ్ నూ పలకరించారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేస్తే, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయని వైశ్య సంఘాల ప్రముఖులు వ్యాఖ్యానించారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకుని తీరుతామని వారు స్పష్టం చేశారు.

Related News