ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న అమెరికాలోని 28 సంస్థలు త్వరలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనున్నాయి. అంతేగాకుండా డెల్ కంపెనీ తన డేటా సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా 3వ రోజు డల్లాస్ వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న 28 సంస్థల ప్రతినిధులు ఆయనను కలిశారు. అమరావతి, విశాఖలో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి కనబరచారు. లీజ్ ప్రాతిపదికన స్థలాలు కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబుకు చెప్పారు. ప్రీమియర్, గ్లోబల్ ఔట్లుక్, టెక్ప్రోస్ సాఫ్ట్వేర్, ఆర్కస్ టెక్, శ్రీటెక్, మద్ది సాఫ్ట్ గురూస్ ఇన్ఫోటెక్, ఎఈ ఇన్ఫోటెక్, ఆక్టస్ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి. అలాగే బెల్ హెలికాఫ్టర్ సంస్థ రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తు న్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారితో మాట్లాడుతూ, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మీరంతా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నా రన్న విష యం తనకు తెలుసన్నారు. మీ అందరినీ పారిశ్రామిక వేత్తలుగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, మరింత ఎత్తుకు ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. వృత్తి నిపుణులుగా వచ్చి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారంటూ ప్రవాస తెలుగువారిని కొనియాడారు.