బ్రిటన్ పార్లమెంట్లో హంగ్ ఏర్పడినా తాజా ఎన్నికల్లో మాత్రం మహిళలు విజయ కేతనం ఎగురవేశారు. ఈసారి బ్రిటన్ పార్లమెంట్‌కు అత్యధికంగా 207 మంది మహిళా ప్రతినిధులు ఎన్నియ్యారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువే.
ప్రధాని థెరిసా మే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ఆశాభంగానికి గురైన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఎన్నికల్లో హౌజ్ ఆఫ్ కామన్స్‌కు మాత్రం 207 మంది మహిళా ఎంపీలు ఎంపికయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లో 196 మంది మహిళా ఎంపీలు మాత్రమే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
బ్రిటన్ ఎన్నికల్లో ఈ సారి మరో పెను సంచలనం కూడా నమోదు అయ్యింది. కెంట్లోని క్యాంటర్బరీ నుంచి లేబర్ పార్టీకి చెందిన రూసీ డఫీల్డ్ ఎన్నికయ్యారు. 1918 నుంచి అక్కడ ఎప్పుడూ లేబర్ పార్టీ గెలవలేదు. ఈ సారి ఆ స్థానాన్ని లేబర్ పార్టీ గెలవడం సర్ప్రైజ్గా భావిస్తున్నారు.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్‌లో కూడా కొత్త రికార్డు నమోదు అయ్యింది. ఆ స్థానం నుంచి భారత సంతతికి చెందిన ప్రీతీ కౌర్ ఎన్నికయ్యారు. బ్రిటీష్ పార్లమెంట్‌కు ఎన్నికైన మొదటి సిక్కు మహిళగా ప్రీతీ కౌర్ చరిత్ర సృష్టించారు.
బ్రిటన్ పార్లమెంట్లో మహిళా ప్రభంజనం... 207 మంది ఎన్నిక
