//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2019 ప్రపంచకప్ ప్రమోషనల్ సాంగ్ విడుదల.....!

Category : sports

వచ్చే సంవత్సరం ఇంగ్లండ్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసింది. ఇంగ్లండ్ మాజీ అల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్ లో రూపొందించిన ఈ పాట క్రికెట్ ప్రేమికుల్ని ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోను ఐసీసీ తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. తొలుత ‘ప్రపంచకప్ వచ్చేస్తోంది’ అని పేపర్ లో చదివిన ఫ్లింటాఫ్.. విజిల్ వేస్తూ ‘ఆన్ టాప్ ఆప్ ది వరల్డ్’ పాటను అందుకుంటాడు. దీంతో ఫ్లింటాప్ కు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్ చేరుకుని సందడి చేస్తారు.

ఈ సందర్భంగా వేర్వేరు దేశాలకు చెందిన జెండాలతో అభిమానులు డ్యాన్స్ చేస్తూ వీధుల గుండా వెళుతుంటే, వీరిని చాలామంది ఫాలో అవుతారు. ఇంగ్లండ్, వేల్స్ లో వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకూ వన్డే ప్రపంచకప్ జరగనుంది. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్ సహా 14 దేశాలు పోటీపడుతున్నాయి. ఈ మెగా టోర్నీ లో ఇంగ్లాండ్ మరియు ఇండియా హాట్ ఫేవరేట్ గా ఉన్నాయి.

Related News