//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీకి ఊహించిన.. షాక్ ఇచ్చిన సొంత సర్వే..

Category : politics

2014 సార్వత్రక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాతో కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో గెలిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ గత ఎన్నికల్లో 282 స్థానాలు గెలుచుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని బీజేపీ సర్వే నిర్వహించి తెలుసుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన 282 స్థానాల్లో కనీసం 152 నియోజక వర్గాల్లో ఓటర్లు బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగు ఎంపీలను కాకుండా కొత్తవారిని పోటీలోకి దించాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం.

ఇక‌ ఇటీవల ఢిల్లీలో జరిగిన మూడు నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనేక స్థానాల్లో కొత్తవారిని పోటీకి దింపి విజయం సాధించింది. దీంతో ఆ ప్రయోగాన్నే వచ్చే ఎన్నికల్లోనూ చేయాలనుకుంటోంది. బీజేపీ సిట్టింగు ఎంపీలను కాకుండా కొత్త వారిని దించినప్పటికీ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. పార్టీలో 75 ఏళ్లు నిండితే వారికి అవకాశాలు ఇవ్వకూడదని గతంలో బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు. గతేదాడి అధికంగా సీట్లు వచ్చిన రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల నుంచి అధిక సీట్లు గెలుచుకునేందుకు వచ్చే ఎన్నికల కోసం బీజేపీ ప్రణాళికలు వేసుకుంటోందని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.