//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2019 లో సీఎం గ పవన్......తమ్మారెడ్డి...!

Category : politics

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఏపీ, తెలంగాణ రాజకీయాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ‘నా ఆలోచన’ అనే కార్యక్రమంలో ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు తమ్మారెడ్డి. చంద్రబాబుని, జగన్‌ని జైల్లో పెట్టి, పవన్‌కు అవకాశం కల్పించడం బీజేపీ గేమ్ ప్లాన్ అని ఓ ఆటో డ్రైవర్ రాష్ట్ర రాజకీయాలపై చేసిన ఎనాలసిస్‌ను ప్రేక్షకులకు తెలియజేశారు తమ్మారెడ్డి.

ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజకి ఓ ఆటో డ్రైవర్‌కి మధ్య జరిగిన సంభాషణలు వారి మాటల్లోనే.. ‘ఈ రోజు నా ఆలోచనలు కాదు.. నాకు ఎదురైన సంఘటనను చెబుతున్నా.. ఈమధ్య కాలంలో నేను విజయవాడ వెళ్లా, బస్ స్టాండ్ నుండి మాచవరం వెళ్లేందుకు ఆటో ఎక్కా.. ఆ ఆటో నిండా పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయ్. దీనితో పాటు ఆ ఆటో డ్రైవర్ చేతిపై ‘జనసేన’ అని పచ్చబొట్టును చూశా. నాకు టైం పాస్ అవుతుంది కదా అని ఆటో డ్రైవర్‌తో ఏమయ్యా.. నువ్ పవన్ అభిమానివా అని అడిగా.. అవును సార్ నేను జనసైనికుడిని అన్నాడు. మీరు చిరంజీవి కూడా ఇలా ముంచేశారు అని అన్నా.. అది వదిలేయండి సార్.. ఇప్పుడు ఏపీకి కాబోయే సీఎం పవన్ అన్నాడు.

ఎలా అవుతాడయ్యా... సీఎం? అతనికి సరైన నెట్ వర్క్ లేదు మీలాంటి అభిమానులు తప్ప అన్నా.. దానికి అతడు రేపు చూడండి సార్.. అసలు పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణలో ఎందుకు రాజకీయ యాత్ర చేశాడో తెలుసా? అమిత్ షా.. పవన్‌కి ఫోన్ చేశారు. అవును సార్.. అమిత్ షా సలహాతోటే పవన్ వెళ్లి కేసీఆర్‌ని కలిశారు. తెలంగాణలో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు.. ఆ సీట్లన్నింటిలో మేం(జనసేన) పోటీ చేస్తాం.. అన్నాడు. టీడీపీతో కలిశా అని అడిగా.. లేదు సార్.. సోలోగా అన్నాడు. మరి టీడీపీ ఉందిగా అన్నాను. ఇంకెక్కడి టీడీపీ సార్.. ఎలక్షన్ టైమ్‌కి కేసీఆర్ ఓటుకి నోటు కేసుని తెరుస్తాడు బాబుని లోపల వేస్తాడు. ఇక్కడ(ఏపీ) సీబీఐ వాళ్లు జగన్‌ను లోపల వేస్తారు. అంటూ తనకు తెలిసిన రాజకీయం గురించి చెప్పుకొచ్చాడు ఆటో డ్రైవర్.

సరే నువ్ అన్నదే నిజం అనుకుందాం.. మరి బీజేపీ-టీడీపీ ఒకటే కదా అన్నానేను.. సార్ మీరు బీజేపీని తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న లాలూని లోపల వేశారు. కనిమొళిని బయటకు తెచ్చారని దేశ రాజకీయాల గురించి జనసైనికుడు చెప్తూనే ఉన్నాయి. అప్పుడు నేను బీజేపీ వాళ్లు కలిస్తే జగన్‌తో కలుస్తారు కాని ఒక్కసీటు కూడా లేని జనసేనతో ఎందుకు కలుస్తారయ్యా అని అన్నా.. మీరెక్కడ ఉన్నారు సార్.. పవన్ ఉన్నాడంటే వాళ్లు 30 నుండి 40 పర్సంటేజ్ సీట్లు పోటీ చేయొచ్చు. మిగిలిన పార్టీలతో కలిస్తే వాళ్లకు ఆ ఛాన్స్ ఉండదు. ఒక మా పార్టీకి డబ్బు కూడా వాళ్లే చూసుకుంటారు. అప్పుడు మా అన్న సీఎం కావడం గ్యారంటీ.

వాళ్లకు ఏపీలో బలం పెరిగి పెద్ద పార్టీ అవుతుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలూ అంటూ చెప్పడంతో అతని మాటలకు నేను షాక్ అయ్యా. ఇక నేను దిగవలసిన మాచవరం రావడంతో అతనికి రూ. 100 ఇవ్వడంతో సిన్సియర్‌గా రూ.20 నాకు తిరిగి ఇచ్చేశాడు నిజాయితీగా. ఒక జనసైనికుడి చేతల్లో ఎంత నిజాయితీ ఉందో మాటల్లో కూడా అంతే నిజాయితీ నాకు కనబడింది.

అతను చెబుతున్న దాని ప్రకారం పవన్, కేసీఆర్, బీజేపీ కలిసి ఏపీలో పవన్ కళ్యాణ్ సీఎంను చేస్తారని.. చంద్రబాబు, జగన్‌లను జైలుకి పంపుతారంటున్నాడు. మనం ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాం.. కాని సామాన్య పౌరుడి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియజెప్పేందుకే ఈ విషయాలు మీతో షేర్ చేసుకున్నా అన్నారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ.

అయితే తమ్మారెడ్డి ‘నా ఆలోచన’లో తెలిపిన విషయాలను కత్తి మహేష్ రీ ట్వీట్ చేస్తూ.. చంద్రబాబుని, జగన్ ని జైల్లో పెట్టి,పవన్ కు అవకాశం కల్పించడం బీజేపీ గేమ్ ప్లాన్ అని. ఏమో... గుర్రం ఎగరావచ్చు. అంటూ ట్విట్టర్‌లో షేర్ చేయండం ప్రాధాన్యత సంతరించుకుంది. గుర్రం ఎగురుతుందో లేదో తెలియదు కాని ట్వీట్ మాత్రం వైరల్ అయ్యింది.