//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

Category : politics state

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గ్రూప్ పాలిటిక్స్‌తో భ‌గ్గుమంటోంది. రాజ‌కీయ పార్టీ అన్న త‌రువాత ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నించే నేత‌లు గ్రూప్స్ క‌ట్ట‌డం చాలా స‌హ‌జం. కానీ, ఏకంగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కేంద్రంగానే పార్టీ రెండుగా చీలిపోతే మాత్రం అది స‌హ‌జ‌మైన ప‌రిణామం కాదు. ఇప్పుడు చిల‌క‌లూరిపేట వైసీపీలో జ‌రుగుతుంది అదే అంటున్నార‌ట పార్టీ కార్య‌క‌ర్త‌లు.2014 Political Seen Repeat for ysrcp jagan

చిల‌క‌లూరిపేట నుంచి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించారు ప్ర‌త్తిపాటి పుల్లారావు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌నే పంథాతో ఉన్నార‌ట పుల్లారావు. ఇటు వైసీపీ మాత్రం గ్రూప్ పాలిటిక్స్‌తో ఇబ్బంది ప‌డుతుంద‌ట‌. అందుకు కార‌ణం, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పేన‌ట‌. నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు చిల‌క‌లూరిపేట వైసీపీ ఇంచార్జిగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కొన‌సాగుతూ వ‌చ్చారు. మంత్రి పుల్లారావు మీద తీవ్ర స్థాయిలో దాడి చేస్తూ రాజ‌కీయంగా వేడి రాజేస్తూ వ‌చ్చారు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.2014 Political Seen Repeat for ysrcp jagan

అయితే, ఆయ‌న హ‌ఠాత్తుగా అనారోగ్యం భారిన ప‌డ‌టంతో జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి కూడా త‌ప్పించారు. ఆ త‌రువాత రాజ‌శేఖ‌ర్ కోలుకున్న‌ప్ప‌టికీ అదే దూకుడుతో రాజ‌కీయం చేయ‌గ‌ల‌రా..? లేదా..? అన్న సందేహం పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతోందట‌. సీన్ క‌ట్ చేస్తే. పార్టీలోకి మ‌రో ఇంఛార్జ్ వ‌చ్చేశార‌ట‌. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను చిల‌క‌లూరిపేట ఇంచార్జి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన వైసీపీ హైక‌మాండ్ ఆ స్థానంలో ఎన్నారై విడుద‌ల ర‌జ‌నీ ని తీసుకొచ్చింది. దీంతో ఒక్క‌సారిగా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింద‌ట‌. 2014 Political Seen Repeat for ysrcp jagan

విడుద‌ల ర‌జ‌నీ కి ఇంచార్జ్ ప‌ద‌వి ఇవ్వ‌డానికి నిర‌స‌న‌గా మ‌ర్రి వ‌ర్గం త‌మ పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసింది. నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ హోదాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విడుద‌ల ర‌జ‌నీ కే వైసీపీ హైక‌మాండ్ టిక్కెట్ ఇవ్వొచ్చ‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌టంతో మ‌ర్రి రాజ‌శేఖర్ వ‌ర్గం మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతుంద‌ట‌. విడుద‌ల ర‌జ‌నీకి ఏ మాత్రం స‌హ‌క‌రించ‌వ‌ద్ద‌ని.. త‌న కేడ‌ర్‌కు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఇలా, చిల‌క‌లూరిపేట‌లో గ్రూప్ పాలిటిక్స్‌తో నిండా మునిగిపోయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.2014 Political Seen Repeat for ysrcp jagan