//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్ వివేకా హత్య కేసు లో పలువురు అరెస్టు ....

Category : state politics

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. వివేకా హత్యలో నిజానిజాలు వెలుగులోకి రావాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే వైఎస్‌ జగన్‌…

వివేకా హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే జగన్‌ పిటిషన్‌ వేసి మూడు రోజులు అవుతున్నా హైకోర్టులో నెంబరింగ్‌ అవ్వకపోవడంతో.. మరో పిటిషన్‌ దాఖలు చేశారు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ . వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తున్న సీఐపై తమకు అనుమానాలున్నాయని ఆరోపణలు చేశారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. మరో వైపు వివేకా హత్యకేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని నగరిగుట్ట, లింగాల, సింహాద్రిపురం మండలాలకు చెందిన 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాత నేరస్తులందరినీ విచారిస్తున్న సిట్‌..

ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తోంది. ఈకేసులో ఇంత వరకూ నిందితులు ఎవరన్నది తేలలేదు. ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, శేఖర్‌రెడ్డి విచారణలో.. రాబట్టిన సమాచారం ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదంపైన ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది. మరోవైపు విచారణ సరిగానే జరుగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడుతామని చెబుతున్నారు ఏపీ పోలీసులు . ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసులో చివరికి ఏం తేలుతుందనేది ఉత్కంఠను రేపుతోంది.

Related News