//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్‌కౌంటర్‌లో 20మంది మావోయిస్టులు హతం

Category : national

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. బీజాపూర్‌ జిల్లాలోని అటవీప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక కార్యాచరణ దళం, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఎదురుకాల్పుల్లో 20మంది మావోయిస్టులు హతమయ్యారు. 

సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు తారసపడిన మావోయిస్టులు కోబ్రా యూనిఫాంలో ఉన్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్‌ చేపట్టిన మూడు రోజుల ప్రత్యేక ఆపరేషన్‌లో 20 మంది మావోయిస్టులు హతమైనట్లు సీఆర్‌పీఎఫ్‌ ఐజీ మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్‌లో 350 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు పాల్గొన్నారు.

తాల్చేరు ప్రాజెక్టు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని మావోయిస్టులకు సాయం చేసేవారిగా అనుమానిస్తున్నారు. అయితే, ఎన్‌కౌంటర్‌ కచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. .