//single page style gallary page

2.O played as an average here. Will China create a sensation in the market or

Category : movies

Click here to read this article in Telugu

ఇక్కడ యావరేజ్ గా ఆడిన 2.O .... చైనా మార్కెట్ లో సంచలనం సృష్టిస్తుందా....లేదా....?

ప్రపంచ మార్కెట్ పుణ్యమా అంటూ ఇప్పుడు ఏ భాషా చిత్రం అయిన సరే ఎక్కడైనా రిలీజ్ చేసుకునే వెసులుబాటు దొరికింది. తద్వారా మార్కెట్ విస్తరణ సినిమా వసూళ్లు ప్రపంచ మార్కెట్ లో సత్తా చాటు తున్నాయి.అందుకు నిదర్శనమే బాహుబలి వంటి అత్యుత్తమ సినిమా వసూళ్లలో రికార్డ్ . ఈ లెక్కన ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్ టాలీవుడ్ లోను విడుదల అవుతూ సినిమా వసూళ్లలో కొత్త వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. మన దేశ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమాల్ రిలీజ్ అవుతు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఇక హాలీవుడ్ వాళ్ల దండయాత్ర కేవలం అమెరికా- పాశ్చాత్య దేశాలకే పరిమితం కాదు. ఆసియాలో అన్ని దేశాల్ని ఆక్రమించి భారీ స్థాయిలో సినిమాల్ని రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఈ వార్ లో హాలీవుడ్ కి పోటీగా భారతీయ సినీపరిశ్రమ కూడా ఎదుగుతోందా....? అంటే నిజమే అని చెప్పాలి. గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలు కూడా వరల్డ్ మార్కెట్ పై కన్నేసిన సంగతి తెలిసిందే.

ఈ దెబ్బతో హాలీవుడ్ సినిమాలకు ధీటైన సినిమాల్ని తీస్తూ దేశ- విదేశాల్లో మన సినిమాలను రిలీజ్ చేస్తూ వసూళ్ల వేట మొదలై పెట్టీ ప్రపంచ మార్కెట్ లో ఇప్పిప్పుడే తిరుగులేని శక్తిగా గా ఎదుగుతుంది.ఇది ఇలా ఉంటే ఇటీవలే రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ "అవెంజర్స్- ది ఎండ్ గేమ్" అమెరికాకు ధీటుగా చైనాలోను రిలీజై సంచలన విజయం సాధించింది. అక్కడ ఏకంగా 4 వేల కోట్లు (600 మిలియన్ డాలర్లు) వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక భారతీయ సినిమాలకు చైనా మార్కెట్ అద్భుతంగా కలిసొస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా "దంగల్" కూడా 1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దంగల్ స్ఫూర్తితో రిలీజైన చాలా సినిమాలు అక్కడ మార్కెట్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి. అమీర్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ దాదాపు 810 కోట్లు వసూలు చేసింది. భజరంగి భాయిజాన్ .. ఇంగ్లీష్ మీడియం.. మామ్ చిత్రాలు కూడా అక్కడ మార్కెట్ లో ఘన విజయం సొంతం చేసుకున్నాయి.

ఇక బాహుబలి రిలీజై ఆశించిన విజయం సాధించకపోయినా ప్రభాస్ - రానా లాంటి స్టార్లను అక్కడ ఎస్టాబ్లిష్ చేయడంలో విజయం సాధించారు.ఈ లెక్కన ఇప్పుడిప్పుడే చైనాలో మన స్టార్లకు గుర్తింపు లభిస్తుంది.ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చైనాలో జూలై 12న అత్యంత భారీగా రిలీజవుతోంది. ఇప్పటికే చైనీ భాషలో పోస్టర్లను డిజైన్ చేసిన లైకా సంస్థ ప్రచారంలోనూ వేడెక్కిస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఈ పోస్టర్ ని తరణ్ ఆదర్శ్ రివీల్ చేశారు. చైనా మార్కెట్లో 2.0 సత్తా ఎంత....? ఒక సౌతిండియా డైరెక్టర్ రూపొందించిన సినిమా ఏ స్థాయిలో ఆడబోతోంది....? మన గ్రాఫిక్స్ స్టాండార్డ్స్ .. ఎమోషన్స్ చైనీయులకు ఏమేరకు నచ్చుతాయి....? అన్న ఆసక్తికర చర్చ కోన సాగుతోంది. ఇక్కడ అంత అంతగా ఆడిన సినిమా...చైనా మార్కెట్ లో ఎలా ఆడబోతుంది అన్నది చూడలిసిందే.

The world market is now available for any language film, where it is easy to release anywhere. The market gap in the global market has been a huge surge in the global market. The record is the best film ever recorded as Bahubali. The new Wonders creates a cinematic grossing film which is already released in several Hollywood cinemas Tollywood. Hollywood cinema release across the country is taking hundreds of crores. The Hollywood invasion is not limited to the US-Western nations. All countries in Asia occupy and release a large number of films. But is the Indian film industry growing up to compete with Hollywood in this war? That is true. Indian films have seen over the world market in the last few years.

Hatching movies with this blow will make it a reality for the release of our films in India and abroad, and it will grow as the undisputed force in the petty world market. If this is the latest release of the Hollywood movie "Avengers-The End Game", America is well-tolerated in China. There were about 4,000 crores ($ 600 million) of gross collection. The Chinese market is well known for Indian films. Aamir Khan's Bollywood movie "Dangal" has also grossed more than 1900 crores. After that, many films with Dangal's inspiration have shackled the market there. Ameer's secret superstar has grossed Rs 810 crores. Bajrangi Bhojan .. English medium and mam pictures also have a huge success in the market.

The star of the South Indian Superstar, Rajinikanth and Shankar, has been released in China on July 12th. Already in the Chinese language the posters have been designed by Lycaa in the campaign. This poster has been posted on Twitter recently by Taran Adarsh. How China's 2.0 is in the market At what level will the film by a South Indian director be made? What are our graphics stands for emotions? Interesting discussion is going on. It's like watching a movie here ... how it will look in the Chinese market.