//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Category : world

కొన్ని దేశాలు ఆర్ధికంగా ముందుంటే కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కురుకుపోతున్నాయి. అలా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాలలో వెనిజులా ఒకటి. అవును వెనిజులా దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. దీని ఫలితంగా ఆ దేశ కరెన్సీకి ఏమాత్రం విలువ లేకుండాపోయింది. దీనితో అక్కడ నిత్యావసర ధరలు ఆకాశన్ని అంటాయి. దీంతో రెండు కేజీల చికెన్ ధర ఏకంగా కోటి 46 లక్షలు పలికింది. అయితే, ఈ ధర మన కరెన్సీలో కాదులెండి. వెనిజులా దేశ కరెన్సీ లెక్కల్లో.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనిజులాలో ద్రవ్యోల్బణం శ్రుతి మించడంతో వాళ్ళ కరెన్సీ అయిన బాలివర్లకు విలువ లేకుండా పోయింది. దీని వలన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంలో రెండు కేజీల చికెన్ కొనాలంటే అచ్చంగా కోటి 46 లక్షల బాలివర్లు చెల్లించాల్సిందే.

అదే 2 కిలోలు చికెన్ మన దేశ కరెన్సీలో అయితే 150 రూపాయలు కాగా అదే అమెరికాలో అయితే 2.22 డాలర్లు మాత్రమే. అందుకే మన దేశంలో చిన్నచితకా నోట్లను జనం చెత్తకుండీల్లో వేస్తున్నారు. దేశం ఆర్థిక ఉన్నప్పటికీ ఆ చికెన్ షాపు యజమాని ఇలా ఓ బోర్డును పెట్టాడు.

Related News