//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 2% డిఎ పెంపు.............?

Category : national

చాలా కాలంగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. పంద్రాగస్టు కానుకగా, ఉద్యోగులకు, పెన్షనర్లకు 2శాతం డీఏ పెంపునకు మోడీ సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికార వర్గాల నుంచి పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఏడవ వేతన సవరణ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఫిట్‌మెంట్‌, మూలధన వేతనపెంపు ఉండొచ్చని తెలుస్తోంది.

ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే దేశవ్యాప్తంగా 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61.17 లక్షల మంది పెన్షనర్లకు లబ్దిచేకూరనుంది. నాలుగు నెలల కిందట (మార్చిలో) డీఏ రెండుశాతం పెంచిన విషయం తెలిసిందే. జమ్ము-కాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, త్రిపుర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు 7వ వేతన కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ అలవెన్సులను పెంచిన నేపథ్యంలో, కేంద్రప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లను లేవనెత్తారు.

గరిష్ట కనీస వేతనం, ఫిట్‌మెంట్‌ కారకాల పెంపునకు దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వానికి వినతులు పంపారు. ఇదిలావుంటే, ఈ యేడాది ప్రారంభంలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి రాధాకృష్ణన్‌ రాజ్యసభకు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. 7వ వేతన కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు మోడీ సర్కార్‌ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.