Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

118 సినిమా రివ్యూ....!

Category : movies

నిర్మాణ సంస్థ‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, షాలిని పాండే, నివేదా థామ‌స్ త‌దిత‌రులు

మాట‌లు: మిర్చి కిర‌ణ్‌

సంగీతం : శేఖర్‌ చంద్ర

దర్శకత్వం : కేవీ గుహన్‌

నిర్మాత : మహేష్‌ ఎస్‌ కోనేరు

సినిమా కెరీర్ ప్రారంభం నుంచే ప్ర‌తి సినిమాలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తన దైన నటనతో గురింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ రామ్ . అలాగే కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇచ్చే హీరోల్లో ఎప్పుడూ ముందుండే క‌ల్యాణ్ రామ్ ఈసారి సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్‌కు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చారు.

లిమిట్ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయనే ‘118’ను విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ హక్కులను దిల్ రాజు కొనుగోలు చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. నందమూరి అభిమానులు సైతం సినిమా హిట్టు ఖాయమని ఫిక్సయిపోయారు. అభిమానుల అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘118’పై పై మన తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.సినిమా స్టోరీ విషయానికి వస్తే ....!

స్టోరీ :

గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. అడ్వంచర్లను ఇష్టపడే గౌతమ్ ఆలోచనలు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంటాయి. ఒక రోజు హైదరాబాద్ శివారులో ఉన్న పారడైజ్ రిసార్ట్స్‌లో స్టే చేస్తాడు. ఆ రోజు రాత్రి గౌతమ్‌కు ఒక కల వస్తుంది.ఆ కలలో ఒక అమ్మాయిని ఎవరో కొడుతున్నట్టు, ఓ కారును ఎత్తైన ప్రదేశం నుంచి చెరువులోకి తోసేస్తున్నట్టు కలలో కనిపిస్తుంది. సరిగ్గా ఆరు నెలల క్రితం మళ్లీ అదే రిసార్ట్‌కు గౌతమ్ వెళ్తాడు. ఇంతకు ముందు స్టే చేసిన రూమ్‌లోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి కూడా అదే కల వస్తుంది. దీంతో గౌతమ్‌లో కలవరం మొదలవుతుంది. అసలు తనకు కలలో కనిపించిన అమ్మాయి ఎవరు, అసలు ఆమెకు ఏం జరిగింది అనే విషయాలు గౌతమ్ ఎలా తెలుసుకున్నాడు.. ఓ కార్పోరేట్ ఫార్మా క్రైమ్‌ను ఎలా బయటపెట్టాడు అనే నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ కొనసాగుతుంది.

ఎవరెలా చేశారంటే:

ఈ సినిమాలో కీలకమైన పాత్రలు గౌతమ్ (కళ్యాణ్ రామ్), ఆద్య (నివేదా థామస్), ఎస్తర్ (హరితేజ). ఈ మూడు పాత్రలకు వీరు ముగ్గురూ పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేసిన పాత్రల్లోకెళ్లా ఇది ఎంతో ప్రత్యేకమైనది. కళ్యాణ్ రామ్ లుక్, నటన సినిమాకు ప్లస్ అయ్యింది. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్‌ చూపించింది. హీరోయిన్‌ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. హరితేజకు కూడా ఎస్తర్ రూపంలో ఓ మంచి పాత్ర దక్కింది. నాజర్, ప్రభాస్ శ్రీను, ముఖ్తార్ ఖాన్, రాజీవ్ కనకాల, గగన్ విహారి తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. పరిగెత్తే కథనం సినిమాను బాగా కలిసొచ్చిందని మరికొందరి మాట. ఇదే టాక్ తొలిరోజు పూర్తయ్యే వరకూ ఉంటే కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టే. .

ప్ల‌స్ పాయింట్లు

* న‌టీన‌టుల న‌ట‌న‌

* నేపథ్య సంగీతం

మైన‌స్ పాయింట్లు

* సెకండాఫ్‌

* లాజిక్‌ లేని సీన్స్‌

Related News