లైంగిక వేధింపులకు పాల్పడిన 65 కేసులతో పాటు ఇంగ్లాండ్ లో భారత సంతతికి చెందిన ఒక వైద్యుడిపై 118 కేసులను నమోదు చేశారు. ఉత్తర లండన్ కు చెందిన పోలీస్ అధికారుల కధనం ప్రకారం లైంగిక నిరోధక చట్టం - 2013 క్రింద బృనెల్ క్లోజ్ కు చెందిన డా. మనీష్ షా అనే వైద్యుడిని అరెస్ట్ చేసి న్యాయవిచారణకు పంపారు.
2004 నుండి 2013 వరకు పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు కేసులు నమోదయ్యాయి. లైంగిక వేధింపులకు గురయిన వారిలో 13 ఏళ్ళ ఒక బాలిక కూడా ఉన్నారు. ఇదే ఆరోపణపై మనీష్ షా ఇదివరలో కూడా ఒకసారి అరెస్ట్ అయ్యిన్నట్లు తెలుస్తున్నది.నిందితుడిని ఆగష్టు 31న బార్ కింగ్ సైడ్ న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీస్ లు తెలిపారు.