//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పదివేల పరుగుల క్లబ్ లో 'యూనిస్ ఖాన్'

Category : sports

ముందుగానే తన రిటైర్ మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ 'యూనిస్ ఖాన్', వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ లో నాలుగవ రోజున 10,000 పరుగులు చేసిన ఘనతను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన పాకిస్థాన్ తొలి క్రికెటర్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. అలాగే ప్రపంచ మేటి క్రికెట్ దిగ్గజాలు అయినా బ్రయన్ లారా, సచిన్ టెండూల్కర్, కుమార సంగర్కర, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరడం మరో విశేషం. ఇది ఇలా వుంటే ఈ టెస్ట్ సిరీస్ లో మరో పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడైన, టెస్ట్ కెప్టెన్ 'మిస్బా ఉల్ హక్' కూడా ముందుగానే 'రిటైర్ మెంట్' ప్రకటించిన విషయం తెలిసిందే.