వందేళ్ల వయసులో నిలుచోవటం, కూర్చోవటమే కష్టం, అలాంటిది 100 మీటర్ల పరుగు పోటీల్లో పోటి పడి మరీ విజయంతో స్వర్ణ పతకం సాధించింది. వినటానికే ఆశ్చర్యంగా ఉన్న నమ్మాల్సిందే మరి. భారత్ కు చెందిన 101 ఏళ్ల వయసు గల "మన్ కౌర్" ప్రపంచ మాస్టర్ గేమ్స్ లో పసిడి పతకంతో మెరుపులు మెరిసింది. ఆక్లాండ్ లో సోమవారం జరిగిన 100 మీటర్ల రేసులో కౌర్ ఒక నిమిషం 14 సెకన్ల టైమింగ్ తో ముగించి ఛాంపియన్ గా నిలిచింది ఆ బామ్మ, స్టేడియంలో ఆమె పరుగును వేలాది మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. చండీగఢ్ కు చెందిన ఈ బామ్మకు ఇప్పటికి ఇది 14 వ స్వర్ణ పతకం కావటం ఆశ్చర్యకరమైన విషయం, గతంలో ఆమెకు క్రీడల్లో ఎలాంటి అనుభవం లేకున్నా కుమారుడు గురుదేవ్ సింగ్ ప్రోత్సాహంతో 93 ఏళ్ల వయసులో రన్నింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టి, గత ఎనిమిదేళ్లుగా ఎన్నో విజయాలు సాధిస్తూ మాస్టర్ అథ్లెటిక్స్ లో ఈ బామ్మ విశేషంగా రాణించటం విశేషమనే చెప్పవచ్చు.