//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అయ్యప్ప ఆదాయం లో ఆల్‌టైమ్ రికార్డ్ !

Category : national

కేరళలోని శబరిగిరుల్లో పంబానది తీరాన వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది.

ఈ సీజన్లో ఆలయం తెరిచిన 25 రోజుల్లోనే ఆలయానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఆదనంగా రూ. 15 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా అధికారులు చెబుతున్నారు.

మండల పూజలు పూర్తయ్యే వరకు ఆలయ ఆదాయం మరింత పెరుగే అవకాశం ఉందని అంటున్నారు. గత ఏడాది ఈ సమయానికి 85.96 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.100 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సీజన్ ముగిసేలోపు రూ. 300 కోట్లకు పైగా ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

శబరిమల అప్పయ్య మొత్తం ఆదాయం రూ. 101, 08,80,925. అరవణ, అప్పం ప్రసాదం అమ్మకeల ద్వారా రూ. 52,63,02,745, హుండీ ఆదాయం రూ. 35,89,26,885 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంబ, శరంగుత్తి, సన్నిధానం దగ్గర భారీ రద్దీ ఉంది. వృద్ధులు, చిన్నారులు రద్దీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని పోలీసులు ప్రత్యేక దారిలో పంపుతున్నారని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది.