//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విమానం హైజాక్ అయిందంటూ మోదీకి ట్వీట్

Category : national business

జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం గురువారం ముంబయి నుంచి దిల్లీ బయల్దేరింది. అయితే దిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దారి మళ్లించి జయపుర ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 176 మంది ప్రయాణికులున్నారు. అయితే అసలు విషయం తెలియని ఓ ప్రయాణికుడు విమానం ఇంకా దిల్లీ చేరుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. దీంతో తమ విమానం హైజాక్‌ అయినట్లుంది అంటూ ప్రధాని మోదీకి ట్వీట్‌ చేశారు.

‘మోదీ సర్‌.. మేం గత 3 గంటల నుంచి జెట్‌ఎయిర్‌వేస్‌ విమానంలోనే ఉన్నాం. చూస్తుంటే విమానం హైజాక్‌ అయినట్లుగా ఉంది. సాయం చేయండి ప్లీజ్‌’ అంటూ ప్రధానికి ట్వీట్‌ చేశారు.దీంతో ఉలిక్కి ప‌డిన జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది.. ఢిల్లీలో వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌ మా విమానం 9డ‌బ్ల్యూ 355 ఆల‌స్య‌మైంది అంతే అంటూ నితిన్‌కు ట్వీట్ చేశారు. ఈ విమానంలో 176 మంది ఉన్నారు.ఈ స‌మాధానంతో నితిన్ సంతృప్తి చెంద‌లేదు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే మిగ‌తా విమానాల‌కు క్లియ‌రెన్స్ ఇచ్చారు క‌దా.. మీ వాద‌న‌కు ఆధారం ఏదైనా ఉందా అంటూ అత‌ను మ‌రో ట్వీట్ చేశాడు.

విమానం జైపూర్ లో దిగగానే అధికారులంతా సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం తనిఖీలు నిర్వహించారు. ట్వీట్ చేసిన వ్యక్తిని విచారణ నిమిత్తం కిందకు దించేశారు. తనిఖీలు పూర్తయిన తర్వాత, ఎలాంటి సమస్య లేదని తేల్చుకున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానాన్ని ఢిల్లీకి పంపించేశారు. అయితే ప్రధానికి ట్వీట్ చేసిన ప్రయాణికుడిని మాత్రం తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తమకు తెలియదని జెట్ ఎయిర్ వేస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.