ఎన్నాళ్లుగానో ప్రేమలో మునిగి తేలిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విరుష్క జోడీ వారం కిందట న్యూఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ జంట సినీ, క్రీడా ప్రముఖుల కోసం ముంబైలో కూడా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు, టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు.
అయితే ఈ రిసెప్షన్‌కు హాజరైన ఓ వ్యక్తి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతను ఎవరో కాదు. టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. ఈ ఏడాది మొదట్లో కుంబ్లేకు, కోహ్లీకి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోహ్లీతో గొడవ వల్లే కుంబ్లే కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆటగాళ్లను కోహ్లీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాడని, అతను కోచ్‌గా ఉంటే తాము ఆడలేమని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
అలాగే బహిరంగంగా కూడా వారిద్దరూ పరోక్ష విమర్శలు చేసుకున్నారు. అలాంటిది కోహ్లీ మ్యారేజ్ రిసెప్షన్‌కు కుంబ్లే హాజరుకావడం చాలామందికి షాక్ కలిగించింది. గొడవలన్నింటినీ పక్కనపెట్టి కుంబ్లేను కోహ్లీ ఆహ్వానించడం, కుంబ్లే కూడా హుందాగా ఆ కార్యక్రమానికి హాజరుకావడం చాలా మందిని ఆకట్టుకుంటోంది.